Sunday, January 19, 2025

గ్రీన్ ఇండియా చాలెంజ్ 6వ విడత: కొండగట్టును దత్తత తీసుకోనున్న సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆరవ విడతను రాజసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. శనివారం కరీంనగర్ లో హరితహారం ప్రారంభం సందర్భంగా ఎంపి సంతోష్, కొండగట్టు అడవిని దత్తత తీసుకొని మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు.

కొండగట్టుకు వచ్చే భక్తులకు సౌకర్యాలు, అటవీ అభివృద్ధి పనులను సంతోష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి దశలో కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆరవ విడతలో పచ్చదనం పెంపు, ప్లాస్టిక్ కాలుష్యం, నియంత్రణ, అవగాహనపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News