Friday, January 17, 2025

గిర్ నేషనల్ పార్క్‌లో అమ్మ, అందమైన పిల్లలు

- Advertisement -
- Advertisement -

MP Santosh shared photos of lions on Twitter on occasion of Mother's Day

చిత్రీకరించిన సింహాల ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఎంపి సంతోష్

మన తెలంగాణ/హైదరాబాద్ : మదర్స్ డే సందర్భంగా గిర్ నేషనల్ పార్క్ లో తను చిత్రీకరించిన సింహాల ఫోటోలను ట్విట్టర్ వేదికగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పంచుకున్నారు. ఈ మదర్స్ డే సందర్భంగా తాను ఇటీవల గిర్ నేషనల్ పార్క్‌లో చిత్రీకరించిన ఈ మనో హరమైన ఫోటోలను పంచుకోవడం సముచితమని భావిస్తున్నాను. అమ్మ,అందమైన పిల్లలు ఒకరితో ఒకరు పంచుకునే బంధం కళ్లకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది. ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోష్ పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన ఎంపి సంతోష్ స్ఫూర్తితో సెలబ్రిటీలు, నేతలు, సినీతారలు విఐపిలు విరివిగా మొక్కలు నాటుతున్న సంగతి విదితమే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News