Monday, December 23, 2024

పార్టీ మారడం లేదు: సోయం బాపూరావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బిజెపి ఎంపి సోయం బాపూరావు ఖండించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అర్థం లేని ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ‘ఈ నెల 27న నా కుమారుడి పెళ్లి ఉంది. పెళ్లి కార్డులు అన్ని పార్టీల వారికీ ఇచ్చాను. పార్టీలకు అతీతంగా నేతలందర్నీ పిలుస్తున్నాను. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సైతం పెళ్లి పత్రిక ఇస్తాను.

గతంలో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బిజెపిలోకి నేనే ఆహ్వానించా. ఆయనతో ఎలాంటి విభేదాలు లేవు‘ అని బాపూరావు తెలిపారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారం వెనుక బిఆర్‌ఎస్ హస్తం ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన దేశమంతా గెలిచినట్లు కాదని వ్యాఖ్యానించారు. అక్కడ బిజెపి పరాజయం పాలైనప్పటికీ ఓట్ల శాతం మాత్రం తగ్గలేదని సోయం బాపూరావు గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News