Friday, November 15, 2024

గూగుల్ , ఫోన్‌పేలు టైం బాంబులు:ఎంపి సుప్రియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌లు ఇప్పుడు మనీమార్కెట్‌లో టైమ్‌బాంబులు అవుతున్నాయని, పేలేందుకు సిద్ధంగా టిక్‌టిక్ అంటున్నాయని ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే పేర్కొన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం గురించి లోక్‌సభలో జరిగిన చర్చలో శుక్రవారం ఆమె మాట్లాడారు. పలు విధాలుగా మనీలాండరింగ్ జరుగుతోందని, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించారు. మనీ యాప్‌ల విషయంలో పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేటిఎం గురించి వెలువడుతున్న వార్తలు ఆందోళనకరం అని తెలిపారు. ఈ వ్యవహారం పూర్తిగా ఆర్థిక అక్రమ లావాదేవీలుగా లెక్కలోకి తీసుకోవల్సిందే. ఇటువంటివి నివారించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆమె ఈ సందర్భంలో ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు.

పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పిపిబిఎల్) లావాదేవీల గురించి ఆర్‌బిఐ కీలక ఆదేశాలు వెలువరించింది. డిపాజిట్ల స్వీకరణ కుదరదని , ఫిబ్రవరి 29 తరువాత కస్టమర్ల లావాదేవీలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పుడు మరో రెండు పేమెంట్ యాప్‌లు గూగుల్ పే, ఫోన్‌పేలు కూడా టైంబాంబులు అయ్యాయని , వాటి వాడకందార్ల పరిస్థితి ఏమిటని ఈ ఎంపి నిలదీశారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున డిజిటల్ లేదా నగదు రహిత ఆర్థిక లావాదేవీల గురించి చెపుతోంది. కానీ ఈ క్రమంలో తలెత్తే గందరగోళం గురించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. కొన్ని మనీయాప్‌లనే ఎంచుకుని ఎక్కువగా వాడకాలు జరిగేలా చేస్తున్నారని , దీనికి ఎవరు కారణం అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News