Thursday, January 2, 2025

బాబ్బాబూ… నాకు పెళ్లి చేయండి

- Advertisement -
- Advertisement -

తనకు పెళ్లి చేస్తేగానీ, ఎన్నికల విధులకు రానని మొండికేశాడో టీచర్. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమర్ పతన్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న అఖిలేష్ కుమార్ తివారీ అనే 35 ఏళ్ల టీచర్ కు ప్రభుత్వం ఎన్నికల విధుల ట్రైనింగ్ కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాను రానని మొండికేశాడు అఖిలేష్. అంతేకాదు, తనకు 35 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాలేదనీ, పెళ్లి చేస్తేనే పోలింగ్ విధుల్లో పాల్గొంటాననీ పేర్కొంటూ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు.

అంతటితో అఖిలేష్ ఆగలేదు, తనకు 35 లక్షల రూపాయల కట్నం కూడా ఇప్పించాలన్నాడు. అలాగే ఒక ఫ్లాట్ కూడా ఇప్పిస్తే బాగుంటుందన్నాడు. పైగా తన అనారోగ్య సమస్యలు కూడా ఆ లేఖలో ఏకరవు పెట్టాడు. వెన్నెముకకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నాననీ, దానిని నయం చేసుకోవడానికి సాయం చేయాలని కూడా కోరాడు. ఎన్నికల విధుల్లో పాల్గొనమంటే, ఇలా కోర్కెల చిట్టా పంపించడంతో చిర్రెత్తుకొచ్చిన అధికారులు అఖిలేషన్ ను సస్పెండ్ చేసి పారేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News