- పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన పూజారులు
- రూ.6 లక్షలు విరాళం ప్రకటించిన ఎంపి
బోనకల్ : మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో నూతనంగా పునర్మిణాం చేసిన శ్రీ మలినాధ మహా నాగ శివాలయాన్ని బుధవారం రాజ్యసభ సభ్యులు, గాయత్రి గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర సందర్శించారు. ఈసందర్భంగా ఆయనకు పూజారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీ రవి మాట్లాడుతూ ఆలయ పునర్మిణాంలో తన వంతు సహాయం చేసే ఆవకాశం రావటం ఆదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఎన్నో పుణ్యాలు చేసుకొంటేనే ఇటువంటి అవకాశం దక్కుతుందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేసే లక్షణం అలవర్చుకోవాలన్నారు. ఆలయంలో వేసేందుకు గ్రానైటు రాయి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. గతంలో కూడా ఆలయ నిర్మాణానికి 1200 బస్తాల సిమెంటును అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. తాను ఇచ్చిన హామీ మేరకు 3 లక్షల రూపాయలను అందజేసినట్లు తెలిపారు. ఆలయం నిర్మాణానికి ఎంపీ రవి యిచ్చిన సహాయానికి గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీని తీసుకురావటానికి కృషిచేసిన గ్రామానికి చెందిన బోయిన శేఖర్‌ను గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ యర్రంశెట్టి సుబ్బారావు, బోయిన శేఖర్, ఉససర్పంచ్ బోయినపల్లి వెంకటేశ్వర్లు, బొగ్గవరపు సోమయ్య, తాళ్ళూరి రామారావు, బొగ్గవరపు రామచంద్రయ్య, సంపసాల రామారావు, బాలు, బోసు, శీలం వెంకటేశ్వర్లు, సాతెల్లి ఈశ్వరాచారి, లింగాచారి, మండెపూడి మోహనరావు, దారెల్లి రాకేష్, బోయినపల్లి కొండలరావు, పోలబోయిన శ్రీకాంత్ పాల్గొన్నారు.