Wednesday, January 22, 2025

కెసిఆర్ పాలనలో మున్నూరు కాపులకు సముచితం గౌరవం: ఎంపి రవిచంద్ర

- Advertisement -
- Advertisement -

MP Vaddiraju Ravichandra On CM KCR

చౌటుప్పల్: ముఖ్యమంత్రి కెసిఆర్ సుపరిపాలనలో తమ మున్నూరుకాపులకు సముచిత గౌరవం దక్కిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. మున్నూరుకాపు నాయకులలో ఇద్దరు రాజ్యసభ సభ్యులం, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండగా,వీరిలో గంగుల కమలాకర్ కీలకమైన పౌరసరఫరాల శాఖ మంత్రిగా, ఎమ్మెల్సీలు ఇద్దరు, పలువురు జెడ్పీ, మునిసిపల్ ఛైర్ పర్సన్స్ ఉన్నారన్నారు. చౌటుప్పల్ పట్టణంలో శనివారం జరిగిన మున్నూరు కాపు ప్రముఖుల సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనం కోసం కేసీఆర్ విలువైన ఐదు ఎకరాల భూమి కేటాయించి, ఐదు కోట్లు విడుదల చేయడాన్ని గుర్తు చేశారు. ఈ విధంగా తమ సంక్షేమం, ఉన్నతికి కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ నాయకత్వానికి, టీఆర్ఎస్ కు రాష్ట్రంలోని మున్నూరు కాపులంతా సంపూర్ణ మద్దతునిస్తున్నారని వద్దిరాజు చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నియోజకవర్గంలోని మున్నూరు కాపులందరూ ఏకపక్షంగా ఓట్లేసి అఖండ విజయం చేకూర్చడం తథ్యమని ఎంపీ రవిచంద్ర చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, చౌటుప్పల్ మునిసిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు, మున్నూరు కాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, హరిశంకర్, ఆకుల రజిత్, వాసుదేవుల వెంకటనర్సయ్య, సకినాల రవికుమార్, జెన్నాయికోడే జగన్ మోహన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News