Thursday, January 23, 2025

దుర్గమ్మకు ఎంపి వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

MP Vaddiraju Ravichandra Visit Kanaka Durga temple

హైదరాబాద్ : విజయవాడ కనకదుర్గమ్మను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రాలు చదువుతూ పూర్ణకుంభంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. సతీమణి విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగాభవానితో కలిసి రవిచంద్ర మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు రవిచంద్రను శాలువాతో సత్కరించారు. తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో గొప్పగా రాణించాలని,మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని రవిచంద్ర అమ్మ వారిని వేడుకున్నారు. ఎంపి వెంట టిఆర్‌ఎస్ మునుగోడు నియోజకవర్గానికి చెందిన నాయకుడు జన్నాయికోడే జగన్మోహన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News