Sunday, December 22, 2024

మెగాస్టార్ చిరంజీవికి ఎంపి వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రసిద్ధ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మదర్ థెరిస్సా నుంచి స్ఫూర్తినొందిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను నెలకొల్పి సమాజానికి విశేష సేవలందించారని ఎంపి రవిచంద్ర ఒక ప్రకటనలో కొనియాడారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తెలుగు వారికి, దేశానికి సేవలందించారని పేర్కొన్నారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, సినిమా రంగంలో రఘపతి వెంకయ్య, మూడు సార్లు నంది అవార్డులు, కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మ భూషణ్ అందుకోవడం,ఇప్పుడు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించడం సంతోషదాయకమన్నారు. చిరంజీవి 155 సినిమాలలో నటించి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నారని ఎంపి వద్దిరాజు ప్రశంసించారు. ఇలాగేఆయన మరిన్ని సినిమాలలో నటిస్తూ, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, మరింత పేరుప్రఖ్యాతులు సంపాదించాలని ఎంపి రవిచంద్ర ఆకాంక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News