Sunday, January 19, 2025

బిజెపి అంటే ‘బాబు జనతా పార్టీ’ కాదు పురందేశ్వరి: విజయ సాయి రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఒక పిల్ల కాలువపై వంతెన కట్టిన అనుభవం కూడా లేని మాజీ మంత్రి రాయపాటి సాంబశివరావుకు పోలవరం కాంట్రాక్టర్‌గా కట్టపెట్టిన ఘనపాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కుతుందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆదివారం విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలవరం కాంట్రాక్టర్‌ని మార్చేశారని అర్థరాత్రి వరకు ప్రాజెక్ట్ పాఠాలు చెప్పారని, కాంట్రాక్టర్ తమరు చెప్పినవారుంటే ఓకేనా? అని బాబును నిలదీశారు.

Also Read: ఆర్టీఐ ప్రశ్నకు 40,000 పేజీల జవాబు

అమ్మా బిజెపి ఎపి అధ్యక్షురాలు పురందేశ్వరి బిజెపి అంటే బాబు జనతా పార్టీ కాదని చురకలంటించారు. బాబుది స్క్రిప్ట్ అని, వదనిది డైలాగ్‌లు కొడుతుందని, తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ అని, మరిది కళ్లలో ఆనందమే టార్గెట్ అని అన్నారు. ఇండియా పేరును విపక్షాలు రాజకీయాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. దేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారనడం వంచించడమే అవుతుందన్నారు. చిహ్నాలు, పేర్లతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ప్రతిపక్ష కూటమికి దేశం పేరు పెట్టడాన్ని అనమతించవద్దని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News