Wednesday, January 22, 2025

నీట్ పై ఇడి ఎందుకు విచారణ చేయడంలేదు: వినోద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు నీట్‌తో లాభమా, నష్టమా తేల్చాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉందని మాజీ ఎంపి వినోద్ కమార్ తెలిపారు. ఈ అంశంపై నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నా చేస్తున్నారని, అదే బాటలో మన ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నపత్రం లీకేజ్ అంశంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయని, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఇడి ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి చాలా మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారని, కానీ 15 శాతం మంది మాత్రమే ఆల్ ఇండియా కోటాకు పోతున్నారని వివరించారు. నీట్ పరీక్షలో సీటు వచ్చిన ఇతర రాష్ట్రాలకు మన పిల్లలు వెళ్లడం లేదన్నారు. తెలంగాణలో 25 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, మరిన్ని మెడికల్ కాలేజీలు వచ్చే అవకాశం ఉందని వినోద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News