- Advertisement -
ముంబయి: ప్రజల జీవితాలకన్నా బెంగాల్ ఎన్నికలకే ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానాపటోలే విమర్శించారు. దేశంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నట్టు నివేదికల్లో వెల్లడైనా ప్రధాని మాత్రం బెంగాల్‌లో భారీ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారని, మాస్క్ కూడా ధరించడం లేదని పటోలే ఆరోపించారు. దాంతో, ప్రధాని ఏ సందేశాన్ని ఇవ్వదలిచారని పటోలే ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రధాని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
MPCC President Nana Patole slams PM Modi
- Advertisement -