Friday, January 24, 2025

కార్యలయంలో అటెండెన్స్..విందుకు హాజరైన ఎంపిడిఓ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

మునగాల: విధులకు డుమ్మా కొట్టి కళ్యాణ కార్యక్రమానికి హాజరైన మునగాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బందిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కార్యాలయం వచ్చిన పలు గ్రామాల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం పరిచారు. ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంబంధిత రికార్డులో విధులు నిర్వహిస్తున్నట్లుగా శనివారం రిజిస్ట్రర్‌లో సంతకాలు చేసి కోదాడలో జరిగిన ఓ కళ్యాణ కార్యక్రమానికి హాజరైయ్యారు. దీంతో కార్యాలయం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. ఇది ఇలా ఉండగా ఉపాధి హామీ సిబ్బంది సైతం కూడా కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రజాపరిషత్ అధికారులు, తమ విధుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ముక్తంకఠంతో ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News