Sunday, December 22, 2024

పాకిస్థాన్ లో ప్రబలుతున్న  ‘మంకీ పాక్స్’ వైరస్  

- Advertisement -
- Advertisement -

ఇస్తామాబాద్:  ‘మంకీ పాక్స్’ అనే వ్యాధి ఆప్రికాలో పెరుగుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. అలా ప్రకటించిన రెండు రోజులకే పాకిస్థాన్ లో మూడు కేసులు నమోదయ్యాయి. ఉత్తర ఖైబర్ ఫక్తూన్ ఖ్వా ప్రాంతంలో శుక్రవారం ఈ విషయాన్ని అక్కడి ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ‘రాయిటర్ వార్తా సంస్థ’ వెల్లడించింది. అయితే ఎలాంటి వేరియంట్ వారికి సంక్రమించిందన్నది ఇంకా స్పష్టం కాలేదు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పాకిస్థాన్ కు చేరుకున్న ఇద్దరు పాకిస్థానీలకు మంకీ పాక్స్ ఉన్నట్లు తేలింది. కాగా మూడో వ్యక్తి శాంపిల్స్ ఇంకా పరిశీలనలో ఉంది. ఆ ముగ్గురిని క్వారంటైన్ లో ఉంచారు. ఇదిలావుండగా స్వీడెన్ లో కూడా కొత్త వేరియంట్ మంకీ పాక్స్ సోకిన ఓ వ్యక్తిని కనుగొన్నారు. అతడు కొన్నాళ్లు ఆఫ్రికాలో ఉండి వచ్చాడు.

2023 జనవరి లో మొదలైన ఈ మంకీ పాక్స్ వల్ల కాంగో దేశంలో 27000 కేసులు నమోదయ్యాయి.  1100 మంది చనిపోయారు. చనిపోయినవారిలో ఎక్కువ వరకు పిల్లలే. మంకీ పాక్స్ ను శాస్త్రజ్ఞులు తొలిసారి 1958లోనే గుర్తించారు.  అది కోతుల్లో మశూచీ వంటి వ్యాధిగా ప్రబలింది. మధ్య ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలలో జంతువుల నుంచి మనుషులకు ఈ వ్యాధి నాడే సోకింది. మంకీ పాక్స్ అన్నది మశూచీ వైరస్ కుటుంబానికి చెందినదే. మంకీపాక్స్ సోకిన వ్యక్తి చేతులు, కాళ్లు, ఛాతీ లేక ముఖం, జననాంగాల వద్ద దద్దుర్లు వస్తాయి. ఆ దద్దుర్లు తెల్లని లేక పసుపు రంగు చీము బొబ్బలు కలిగి ఉంటాయి. ఈ వ్యాధికి ఉండే ఇంకో లక్షణం జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, లింఫ్ నోడ్స్ ఉబ్బడం వంటివి. చాలా అరుదుగా ఈ సంక్రమణం ప్రాణాంతకం కూడా అవుతుంది. తస్మాత్ జాగ్రత్త!!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News