Monday, December 23, 2024

అనాథకు ఆర్థిక సాయం చేసిన ఎంపిపి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: తల్లిదండ్రులను కోల్పోయిన అనాథకు ఆర్థిక సాయం చేసి అన్ని విధాలా అండగా ఉంటానని మోత్కూరు ఎంపిపి రచ్చ కల్పన లక్ష్మీనర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన రాంపాక నవీన్ తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో ఆ విద్యార్థికి ఎంపిపి కల్పన లక్ష్మీనర్సింహారెడ్డి బుధవారం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటీర్‌ను నియమించి నెలనెలా వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రచ్చ రాంరెడ్డి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపిడిఒ పోరెడ్డి మనోహర్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ రచ్చ ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు వీరవెల్లి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News