Sunday, January 12, 2025

బీరన్న బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీపీ

- Advertisement -
- Advertisement -

ఖానాపురం: మండలంలోని కొత్తూరు గ్రామంలో బుధవారం కురుమ కులస్థుల ఆరాధ్య దైవం బీరన్న బోనాల ఉత్సవాల కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ పాల్గొని బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రకాష్‌రావు మాట్లాడుతూ.. బీరన్న దేవుడు దయతో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండి ప్రజలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూస రమ అశోక్, కుల పెద్దలు రాజు, సాంబయ్య, బిక్షపతి, సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కట్టయ్య, నాయకులు కోటి, రాము, మల్లయ్య, పోతురాజు, దేవేందర్, బైటి, బాబు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News