Thursday, January 23, 2025

ఎంపిలు, ఎంఎల్‌ఎలు అతీతులు కాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ‘లంచం లంచమే. సభ్యులకు హక్కులు, పార్లమెంటరీ గౌరవమర్యాదల రక్షణకవచాలు కుదరవు’ అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుట సోమవారం ఏకగ్రీవ , ఘంటాపథ తీర్పు వెలువరించింది. పార్లమెంట్, శాసనసభల సభ్యులు (ఎంపిలు, ఎమ్మెల్యేలు) అవినీతికి పాల్పడినట్లు అయితే వారు కూడా విచారణకు అర్హులే , చట్టసభల సభ్యులు అయినందున వారికి ఎటువంటి మినహాయింపులు, ఉపశమనాలు లేవని, ఇతరత్రా లంచాల వ్యవహారాలలో ప్రాసిక్యూషన్ తరహానే ఇక్కడా పాటించాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు వెలువరించింది. ఎంపిలు ఎమ్మెల్యేలకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు నిచ్చే 1998 నాటి తీర్పును కొట్టివేసింది. ఈ తీర్పు న్యాయమూర్తుల ఏకాభిప్రాయంతో ,న్యాయ చరిత్రలో మైలురాయిగా వెలువడింది. చట్టసభలలో ప్రశ్న లు వేసేందుకు, ప్రసంగించేందుకు , తీర్మానాలకు ఓట్లేసేందుకు నో ట్లు తీసుకునే లంచాలు పుచ్చుకునే ప్రజాప్రతినిధులకు చట్టపరమైన ఉపశమనం అవసరమా? ఇది పూర్తిగా అనుచితమే అవుతుందని పే ర్కొంటూ ధర్మాసనం స్పందించింది. జెఎంఎం ముడుపులకేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించిన ఎంపిలు, ఎమ్మెల్యేలకు ఉపశమనం తీర్పు చెల్లనేరదని కొట్టివేసింది. 1993లో అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానం దశలో ఈ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు లంచాలు తీసుకుని తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయడం, ప్రభుత్వం నిలబడటం జరిగింది. తరువాతి దశలో ఈ ఎంపీలపై అవినీతి కేసులు వచ్చిపడ్డాయి. మలుపుల తరువాత పార్లమెంటేరియన్లు అవినీతి కేసుల నుంచి అతీతులు. వీరికి ఉపశమనం కల్పించే విధంగా పార్లమెంటరీ హక్కులు ఉన్నాయని అప్పటి తీర్పు పేర్కొంది. అయితే సఢలలొ ఓట్లు, ప్రసంగాలు, ప్రశ్నలకు ఇందుకు లంచాలకు ఉపశమనం కల్పించడం అవినీతి అవుతుందనేది చెప్పకుండానే విదితం అయ్యే విషయం అని పేర్కొంటూ ఇప్పటి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ‘ ఎంపిలు, ఎమ్మెల్యేలు అవినీతికి, లంచాలకు మరిగితే అది భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పునాదికే విఘాతం అవుతుంది. అవినీతికి ఎవరూ దిగినా న్యాయస్థానం రక్షించలేదు. పైగా అవినీతి పనులను పార్లమెంటరీ విధానపు సభా హక్కుల పరిధిలోకి ఎలా తెస్తారు? పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని చివరికి సభ్యులకు ఉన్న గౌరవ మర్యాదల పేరిట కించపర్చడం ఎంతవరకు సబబు? ఇటువంటి వాటిని చెల్లుబాటు కానిచ్చేది లేదు. కాబట్టి ఇంతకు ముందటి తీర్పును కొట్టివేస్తున్నాం, అవినీతికి పాల్పడే ప్రజా ప్రతినిధులు , ప్రత్యేకించి సభా కార్యక్రమాల దశల్లోనే బహిరంగంగా ప్రశ్నలకు, ప్రసంగాలకు, చివరికి తమ ఓట్లకు లంచాలకు దిగే వారిని ఏ స్థాయిలోనూ ఉపేక్షించడంకుదరదు’ అని పేర్కొంటూ న్యాయమూర్తులు ఎఎస్ బొప్పన్న , ఎంఎం సుందరేశ్, పిఎస్ నరసింహ, జెబి పార్థీదాలా, సంజయ్‌కుమార్, మనోజ్ మిశ్రాతో కూడిన ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
రాజ్యాంగ విలువలను కాలరాయడం కుదరదు
రాజ్యాంగం నిర్ధేశిత చట్రం పరిధిలోనే ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్థ సాగుతున్నాయి. రాజ్యాంగ ఆకాంక్షలను విలువలను దెబ్బతీసే విధంగా తీర్పు గతంలో వెలువడటం నిజానికి బాధ్యతాయుత వ్యవహారశైలిని అవలంభిచాల్సిన వారు దారితప్పినా వారికి ఈ హక్కు ఉందనే విధంగా వ్యవహరించినట్లు అయిందని తీర్పులో తెలిపారు. తీర్పులోని కీలక పేరాలలోని కొన్ని విషయాలను ఈ దశలో ప్రధాన న్యాయమూర్తి చదివి విన్పించారు. ఎంపిలు ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలు, వారికి చట్టపరమైన ఉపశమనం అనేది ఓ విషయం అయితే, దీనికి న్యాయస్థానం పరంగా మరింత రక్షణ కల్పించిన పరిస్థితి అనేవి తమ ముందుకు వచ్చిన కీలక అంశాలని తాము వెలువరిస్తున్న సుదీర్ఘ తీర్పులోని విషయాలు సుప్రీంకోర్టు వెబ్‌సైట్ ద్వారా పౌరుల అధ్యయనానికి ఉంటుందని డివై చంద్రచూడ్ సెలవిచ్చారు.

1998 నాటి జడ్జిమెంట్‌ను తాము కూలంకుషంగా పరిశీలించడం జరిగిందని, అప్పటి తీర్పును అన్ని స్థాయిల్లో కొట్టివేస్తూ, ఆ తీర్పును తిరగరాస్తూ ఇప్పటి తీర్పు వెలువరిస్తున్నామని ప్రకటించారు. 1998 తీర్పులో ఎంపిలు ఎమ్మెల్యేలకు కేసుల విచారణ నుంచి మినహాయింపు కల్పన కూడా మెజార్టీ తీర్పు ద్వారానే దక్కింది. ఈ తీర్పును ఇప్పుడు మెజార్టీ తీర్పు, ఏకాభిప్రాయ రీతిన విస్తృత ధర్మాసనం కొట్టివేసింది. 1998 నాటి తీర్పు ప్రజా ప్రయోజనాల కోణంలో చూస్తే చాలా తీవ్ర పరిణామాలకు దారితీసే విషయం అయింది. జన జీవితంలో నిజాయితీ, హుందాతనం, పారదర్శకతలకు, ప్రజాస్వామిక పంథాకు చివరికి పార్లమెంటరీ స్థాయిలోనే గండికొట్టే పరిస్థితి ఏర్పడటం, అప్పటి తీర్పు కొనసాగడం గమనించి దీనిని ఇప్పుడు కొట్టివేయడం ద్వారా నూతన అధ్యాయానికి తెరతీస్తున్నట్లుగా తాము భావిస్తున్నామని ఈ ధర్మాసనం తమ తీర్పులో పేర్కొంది. ఆర్టికల్ 105 కానీ ఆర్టికల్ 194 కానీ సభ్యులు చట్టసభలలో చర్చలలో , సంప్రదింపుల్లో తమ అభిప్రాయాల వ్యక్తీకరణలో సరైన స్వేచ్ఛను పొందేలా కల్పించే ఆలోచనతోనే పొందుపర్చడం జరిగిందని ఈ రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అప్పటి తీర్పును వ్యతిరేకిస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అంగీకరించింది. ఇప్పుడు తీర్పు వెలువరించింది.
ఇప్పటి తీర్పు పూర్వాపరం సీతా సోరెన్ కేసుతో
అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధికి ఈ కేసు విచారణ రావడానికి మరో పూర్వాపరం కూడా ఉంది. 2019ల సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ సారధ్యపు ధర్మాసనం జెంఎంఎం ఎమ్మెల్యే (జమా స్థానం), అప్పటి సిఎం శిభూ సోరెన్ కోడలు సీతా సోరెన్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించింది. సీతా సోరెన్ రాజ్యసభ ఎన్నికలలో ఓ అభ్యర్థికి ఓటేసేందుకు లంచం తీసుకున్నారనే అభియోగం ఉంది. దీనిపై విచారణ జరిగింది. తనకు శిక్ష వేయడం కుదదని చట్టసభ సభ్యులకు ఉండే ప్రివిలేజ్ పరిధిలో తనను శిక్ష నుంచి మినహాయించాలని పేర్కొంది.
తనకు శిక్ష విధించిన జార్ఖండ్ హైకోర్టు తీర్పును ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆమెపై దాఖలు అయిన అయిన క్రిమినల్ కేసును అప్పట్లో హైకోర్టు కొట్టివేయడానికి నిరాకరించింది. దీనిపై త్రిసభ్య సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే పివి నరసింహరావు ప్రభుత్వంపై అవిశ్వాసం దశలో అవినీతి ఆరోపణలు, జెఎంఎం లంచాల వ్యవహారం గురించి కూడా విచారణకు నిర్ణయించింది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రధాని మోడీ అభినందించారు. ఇటువంటి తీర్పు వల్ల దేశ రాజకీయాలలో స్వచ్ఛతకు వీలేర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News