Monday, December 23, 2024

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి… కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి… కేంద్ర ప్రభుత్వ నియంతృత్వం నశించాలి… కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్, విపక్ష, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నల్లచొక్కాలు ధరించి పెద్ద ఎత్తున నినాదాలతో న్యూఢిల్లీలో మంగళవారం రాత్రి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అదానీ అంశంపై జేపీసీ వేయాలని ఎంపీలు ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీ ఎంపి సభ్యత్వ రద్దును కోరుతూ కూడా నినాదాలతో ఢిల్లీ వీధులు మార్మోగాయి.

MPs from BRS, and opposition parties held a massive peace rally

ఎర్రకోట నుంచి ప్రారంభమై ఇండియా గేట్ వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అయితే మార్గం మధ్యలో పోలీసులు భారీకేడ్స్ ఏర్పాటు చేసి, ర్యాలీని అడ్డుకున్నారు. భారీకేడ్స్ ను సైతం తొలగించుకొని, ముందుకుపోవాలని ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నుంచి పార్టీ పార్లమెంటరీ నాయకులు కే. కేశవరావు, లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు , ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, బండ్ల లింగయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News