Sunday, December 22, 2024

29, 30 తేదీల్లో మణిపూర్‌లో ‘ఇండియా’ ఎంపీల బృందం పర్యటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జాతుల మధ్య ఘర్షణలతో మండిపోతున్న మణిపూర్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రతిపక్షాల కూటమి ‘ఇండియాకు చెందిన ఎంపీల బృందం ఈ నెల 29, 30 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. 20 మందికి పైగా ఎంపిల బృందం రెండు రోజలు పాటు మణిపూర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటుందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మానిక్కం ఠాగూర్ గురువారం తెలియజేశారు. ప్రతినిధి బృందం ఇండియాలోని పార్టీలనుంచి ఒక్కో ప్రతినిధి పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ బృందం మణిపూర్ లోయతో పాటు కొండప్రాంతాలను కూడా సందర్శించి వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతుంది. బృందం కొన్ని పునరావాస శిబిరాలను కూడా సందర్శించే అవకాశం ఉంది. ఈ బృదంలో మహిళా ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుస్మితా దేవ్, జెఎంఎంకు చెవిన మహువా మఝి,

ఎన్‌సిపికి చెందిన వందనా చవాన్ ఉండారని తెలుస్తోంది. మొదట ముఖ్యమ్రంల బృందం మణిపూర్‌ను సందర్శించాలని ప్రతిపక్షాల కూటమి భావించింది. అయితే రవాణా తదితర సమస్యల దృష్టా ఆ ప్రతిపాదనను తర్వాత విరమించుకుంది. తమ ప్రతినిధుల బృదం మణిపూర్‌ను సందర్శించడానికి అనుమతించాలని ప్రతిపక్షాలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి కానీ అక్కడి పరిస్థితుల దృష్టా అనుమతించలేదు. అయితే వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ చెందిన ప్రతినిధి బృందాలు మాత్రం రాష్ట్రంలో పర్యటించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇంతకు ముందు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలనుసందర్శించారు. మణిపూర్‌లో మే 3వ తేదీనుంచి జాతులమధ్య ఘర్షణలతో అట్టుడికి పోతున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News