Tuesday, December 24, 2024

తమ సమస్యలకు పరిష్కారం చూపాలి: మంత్రి సీతక్కను కోరిన ఎంపిటిసీ సంఘం నేతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎంపీటీసీ సంఘం నేతలు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆదివారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థాయిలో సరైన గుర్తింపు లేకపోవడంతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మంత్రికి వివరించారు. తాము విధుల్లో చేరి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా నిధులు, విధులు లేక అవస్ధలు పడుతున్నామని, తమ సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ నిరాశే మిగిలిందన్నారు. వారి సమస్యలను పూర్తిగా విన్న మంత్రి సీతక్క త్వరలోనే రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటీ అవుతానని ఎంపీటీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News