Wednesday, January 22, 2025

ఎంపిపిపై పెట్టిన అవిశ్వాసం వెనక్కి తీసుకున్న ఎంపిటిసిలు

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్ : నిన్నమొన్నటి దాకా హుజురాబాద్ లో హాట్ టాపిక్‌గా మారిన హుజురాబాద్ ఎంపిపిపై అవిశ్వాస తీర్మాణం ఎట్టకేలకు ఒక కొలిక్కివచ్చింది. సోమవారం సాయంత్రం హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో హరిసింగ్ సమక్షంలో పదిమంది ఎంపిటిసిలు వారు పెట్టిన అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకున్నారు.

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక చొరవతీసుకుని పార్టీలో ఎలాంటి చీలికలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో అవిశ్వాసం పెట్టిన పదిమంది ఎంపిటిసిలతో మాట్లాడి అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకునేలా కృషి చేశారు. కార్యక్రమంలో సింగపూర్ ఎంపిటిసి గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి పెద్దపాపయ్యపల్లి ఎంపిటిసి వైద్యుల శీరీష, కాట్రపల్లి ఎంపిటిసి అనిత వెంకట్, కందువుల ఎంపిటిసి కాసం రఘుపతి పద్మ, సిర్సపెల్లి ఎంపిటిసి రాధమ్మ, శాలపల్లి ఎంపిటిసి లలిత జయరాజ్, చెల్పూర్ 2 ఎంపిటిసి నాగరాజు, రంగాపూర్ ఎంపిటిసి రమేష్, పోతిరెడ్డిపేట ఎంపిటిసి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News