Monday, January 20, 2025

‘మిరపకాయ్’ కంటే ‘మిస్టర్ బచ్చన్’ బావుంటుంది

- Advertisement -
- Advertisement -

డైరెక్టర్ హరీష్ శంకర్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మూవీ ’మిస్టర్ బచ్చన్’పై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. షోరీల్ భారీ అంచనాలను సృష్టించింది. మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆదివారం టీజర్‌ను లాంచ్ చేశారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ అద్భుతంగా తెరకెక్కించారు. రోమాన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్‌తో మిస్టర్ బచ్చన్ మరిపోలేని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి సిద్ధంగా ఉందిని టీజర్ సూచిస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ హరిశ్ శంకర్ మాట్లాడుతూ.. ‘రవితేజతో చేసిన ‘మిరపకాయ్’ కంటే మిస్టర్ బచ్చన్ 100 శాతం బాగుంటుంది.

నా కెరీర్ ఫాస్టెస్ట్ సినిమా ఇది. దీనికి కారణం మా నిర్మాత విశ్వప్రసాద్. 78 రోజుల షూటింగ్‌లో ఏ రోజు ఇబ్బంది పడలేదు. మేము అడిగినదాని కంటే నిర్మాత ఎక్కువ ఇచ్చారు. ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ చాలా ఎక్కువ వుంటుంది’ అని అన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆగస్టు 15న ఐదు రోజుల హాలీడేస్‌కు మా సిని మాతో పాటు మరో పెద్ద సినిమా వస్తుంది. మరో తమిళ్ సినిమా, చిన్న సినిమా కూడా వస్తున్నాయి. మన థియేటర్ సిస్టం ఈ అన్నీ సినిమాలని సపోర్ట్ చేయగలదు’ అని తెలిపారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. నా కెరీర్‌లో హరీష్‌కు ప్రత్యేక స్థానం వుంటుంది. ఆయన నా ఫస్ట్ తెలుగు మూవీ డైరెక్టర్. నాపై చాలా నమ్మకం ఉంచారు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్ కూఛిబొట్ల్ల, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News