Wednesday, January 22, 2025

రవితేజ ఎనర్జీ, చరిష్మా అద్భుతంగా..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంక ర్ కాంబో ’మిస్టర్ బచ్చన్’తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉం ది. ఈ మూవీ ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల కానుంది. బుధవారం మేకర్స్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్, దర్శకుడు హరీష్ శంకర్, వివేక్ కూచిబొట్ల, బ్రహ్మ కడలి, అయాంక బోస్ పాల్గొన్నారు. రవితేజ చెప్పిన పవర్‌ఫుల్, ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు… సంపద కాపాడేవాడు కూడా సైనికుడే..‘అనే డైలాగ్ సినిమాకి టోన్ సెట్ చేస్తుంది. బచ్చన్ తన ఊర్లో జిక్కీ అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ట్రైలర్‌లోని రెప్పల్ డప్పుల్ అనే హై-ఎనర్జీ నంబర్ ఒక హైలెట్‌గా నిలిచింది. టైటిల్ రోల్‌లో రవితేజ పర్ఫార్మెన్స్, ఎనర్జీ, చరిష్మా అద్భుతంగా వుంది. జగపతి బాబు పవర్‌ఫుల్ రోల్‌ని పోషించారు. భాగ్యశ్రీ బోర్స్ తన అద్భుతమైన గ్లామర్, పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. కమర్షియల్ సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేయడంలో హరీష్ శంకర్ తన నైపుణ్యాన్ని మరోసారి చూపించారు. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండియర్ స్పష్టంగా కనిపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News