Monday, January 20, 2025

‘మిస్టర్ ఇడియట్’ ప్రీ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మిస్టర్ ఇడియట్’ అనే టైటిల్ ఖరారు. సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జెజెఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జెజె ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందడి’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్, ప్రీ లుక్‌ను మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నా కెరీర్లో ‘ఇడియట్’ సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు మా రఘు కొడుకు మాధవ్ ‘మిస్టర్ ఇడియట్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాలాగే తనకు కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. చిత్ర నిర్మాత నిర్మాత జెజెఆర్ రవిచంద్ మాట్లాడుతూ ‘ఈ నెల ఆఖరు వరకు షూటింగ్ అంతా పూర్తవుతుంది. సినిమా చక్కగా వస్తుంది. నవంబర్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నాం’ అని తెలిపారు, డైరెక్టర్ గౌరి రోణంకి మాట్లాడుతూ “మిస్టర్ ఇడియట్ సినిమా అన్ని యవర్గాల ప్రేక్షకులను అలరిచే పూర్తి ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాం’ అని అన్నారు.

Also Read: షారుఖ్ ‘జవాన్’ ట్రైలర్.. అద్భుత విజువల్స్ తో గూస్బంప్స్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News