Wednesday, January 22, 2025

“మిస్టర్ కళ్యాణ్” ట్రైలర్ విడుదల

- Advertisement -
“మిస్టర్ కళ్యాణ్” ట్రైలర్  ను విడుదల చేసిన ధమాకా డైరెక్టర్ నక్కిన త్రినాధ్ !!!
 
 ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత ఎన్ వి సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.
 
 
సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగింది. ఒక ప్రేత్యేక సాంగ్ కోసం లడక్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చెయ్యడం జరిగింది.
 
దర్శకులు నక్కిన త్రినాధ్ గారు మాతుడుతూ…
మిస్టర్ కళ్యాణ్ ట్రైలర్ బాగుంది, మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. అందరూ ఆర్టిస్ట్స్ లు బాగా చేశారు. దర్శకుడు పండు కు అలాగే నిర్మాత సుబ్బారెడ్డి గారికి ఈ సినిమా మంచి విజయం సాధించి వారు మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను. అందరూ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
 
నటీనటులు:
మాన్యం కృష్ణ, అర్చన, రాజ్ వర, సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు.
 
 
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: పండు
నిర్మాత: ఎన్ వి సుబ్బారెడ్డి
సంగీతం: సుక్కు
సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి
ఎడిటర్: వినోద్ అద్వయ్
డాన్స్: అనీష్
ఫైట్స్: మల్లేష్
పీఆర్ఒ: శ్రీధర్
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News