Sunday, December 22, 2024

అమ్మ పడే కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథ

- Advertisement -
- Advertisement -

సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ’మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఈ నెల 18న ’మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ “మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు, అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది.

ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ ఎమోషనల్ గా ఉంది. దర్శకుడు శ్రీనివాస్‌కు ఇది ఫస్ట్ మూవీ. ఆయనే స్క్రిప్ట్ రాశాడు. డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. బాగా తెరకెక్కించాడని అర్థమవుతోంది”అని అన్నారు. హీరో సోహైల్ మాట్లాడుతూ “తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి ఎంత కష్ట పడుతుందో మనం వింటుంటాం. కానీ ఆ కష్టాన్ని ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నాను. చాలా మంచి మూవీ. ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ ఉంటాయి”అని తెలిపారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ “డెలివరీ కోసం అమ్మ పడే కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథ ఇది. సినిమా కొత్తగా ఉంటూ ఆకట్టుకుంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్, రవిరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి, అప్పిరెడ్డి, రూపా కొడవయూర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News