Monday, December 23, 2024

ఎంఆర్‌పిఎస్ ఆందోళన హింసాత్మకం: కానిస్టేబుల్‌కు గాయాలు

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఎస్‌సిల వర్గీకరణకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండు చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్‌పిఎస్) కార్యకర్తలు సోమవారం విజయవాడ-హైదరాబాద్ రహదారిపై చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. హైవేను దిగ్బంధించడానికి ప్రయత్నించిన ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడానికి ప్రయత్నించడంతో పోలీసులపై కార్యకర్తలు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్ తలకు గాయం కాగా వెంటనే ఆయనను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు తోటచర్ల వద్ద రహదారిపై బైఠాయించడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువైపులా కొద్దిసేపు తోపులాట జరిగింది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేశారు. పోలీసులు సమీపంలోని గ్రామాలకు వెళ్లి అక్కడ తలదాచుకున్న ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని అంబర్‌పేటలోని తన నివాసంలో ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. హైవేపైన నిరసనలో పాల్గొనేందుకు వెళ్లకుండా కృష్ణమాదిగను పోలీసులు ఆయన ఇంట్లోనే అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News