Monday, January 20, 2025

కిడ్నాపైన ఎంఆర్ పిఎస్ నాయకులను వదిలిపెట్టారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగీలో కిడ్నాప్ కు గురైన ఎమ్మార్పిఎస్ నాయకుడు నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ సురక్షితంగా ఉన్నారు. కొద్ది సేపటి క్రితం ఓ కారులో నరేందర్, ప్రవీణ్ లను నెక్నంపూర్ లోని ఇంటి వద్ద కిడ్నాపర్లు వదిలివెళ్లి పోయారు. ఇద్దరు భయంతో వణికిపోయారు. నరేందర్, ప్రవీణ్ ను కుటుంబ సభ్యులు చూసి గుండెలకు హత్తుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. కిడ్నాపర్లు వారిని కారు వరంగల్ తీసుకొని వెళ్లినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ కు వెళ్దామంటూ రౌడీలు కారులో ఎక్కించుకొని సిటీ దాటగానే ముఖానికి ముసుగు వేసి ఔటర్ మీదుగా వరంగల్ కు తరలించారు. ఓ గదిలో బంధించి ఇద్దరినీ గ్యాంగ్ చితకబాదింది. ఇక్కడ జరిగిన విషయాలు ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తామంటూ హెచ్చరించారు. ఎంఆర్ పిఎస్ లీడర్లు నరేంద్ర అతని ఫ్రెండ్ ప్రవీణ్ ఇప్పటికి ఇంకా షాక్ లో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News