Monday, December 23, 2024

మిసెస్ ఇండియా 2024‌ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన శృతి చక్రవర్తి

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్, జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శృతి చక్రవర్తి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో ప్రతిభావంతులైన మరో 20 మంది పోటీదారులతో పోటీపడిన శృతి చక్రవర్తి ఫైనల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఈ విజయంతో హైదరాబాద్ చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ ప్రయాణంలో ఆమె ప్రదర్శించిన గ్రేస్, ఛార్మ్ ఎందరో హృదయాలను గెలుచుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చేసి ఈ అందాల పోటీలోకి ప్రవేశించిన శృతి ఇందులో తన విద్యా నైపుణ్యం, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి అంకితమైన గృహిణి పాత్ర వరకు తన బహుముఖ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News