- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్‌లో మిసెస్ ఇండియా సుహాసిని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం ఆర్‌జె.సునీత, నిరూపమ, విశాల్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.
- Advertisement -