Sunday, December 22, 2024

‘విడి 13’ సెట్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్

- Advertisement -
- Advertisement -

గీత గోవిందం వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ 13వ చిత్రంగా (విడి 13), శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో 54వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ మధ్యే మూవీని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దిల్ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ మీద నిర్మిస్తుండగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా సినిమా టీం అంతా కలిసి లోకేషన్ల వేటను పూర్తి చేశారు. సినిమా లొకేషన్ల రెక్కీ పూర్తయిన సంగతిని మేకర్లు ప్రకటించి.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. మంగళవారం మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు సందర్భంగా సెట్‌లో ఆమె బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది చిత్రయూనిట్. సెట్‌లో ఆమె చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఫోటోలకు పోజులు ఇచ్చారు.ఈ ఫోటోల్లో మృణాల్ నవ్వులు చిందిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ లుక్స్ సరికొత్తగా ఉన్నాయి. ఈ ఫోటోల్లో యంగ్ నిర్మాత హన్షిత రెడ్డి, శిరీష్‌లు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News