Sunday, December 22, 2024

హాయ్ నాన్న… విజువల్, ఎమోషనల్ ట్రీట్

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో శౌర్యువ్ దర్శకునిగా పరిచయవుతూ రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటించారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ‘హాయ్ నాన్న’ ఈనెల 7న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ “హాయ్ నాన్న సినిమా నేను చేయడానికి ప్రధాన కారణం కథ.

తెరపై హీరోహీరోయిన్లు విరాజ్, యష్ణ ప్రయాణాన్ని చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా వారితో ప్రేమలో పడిపోతారు. ఇందులో నా పాత్ర న్యూ ఏజ్ అమ్మాయిగా వుంటుంది. నా పాత్రలో అన్ని భావోద్వేగాలు వున్నాయి. యష్ణ పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. హాయ్ నాన్న సినిమా మావన సంబంధాలు, భావోద్వేగాలను అద్భుతంగా చూపించింది. నాని వండర్‌ఫుల్ కో స్టార్. ఆయనతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభూతినిచ్చింది. ఇందులో ఆయన అద్భుతంగా నటించారు. దర్శకుడు శౌర్యువ్‌తో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవాన్నిచ్చింది.

కొత్త దర్శకుడితో పని చేస్తున్నామనే భావన రాలేదు. తన మ్యాజిక్ ఈనెల 7న ప్రేక్షకులు చూస్తారు. ‘హాయ్ నాన్న’ విజువల్ ఎమోషనల్ ట్రీట్. బేబీ కియారా చాలా క్రమశిక్షణ గల పాప. సన్నివేశం, అందులో వున్న ఎమోషన్, డైరెక్షన్ చాలా బాగా అర్ధం చేసుకుంటుంది. తన పాత్ర చాలా కీలకంగా వుంటుంది. ప్రేక్షకులని హత్తుకుంటుంది. హాయ్ నాన్నలో మ్యూజిక్ చాలా కీలకం. సినిమాకు హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News