Monday, December 23, 2024

రొమాన్స్ అంటే ఇలా ఉండాలి: మృణాల్ ఠాకూర్

- Advertisement -
- Advertisement -

మృణాల్ ఠాకూర్ ఇటీవలే కల్కి 2898 ఎడి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఈ అమ్మడు రొమాన్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. “నా దృష్టిలో రొమాన్స్ అనేది చిన్న చిన్న చేష్టలతోనే అనిపిస్తుంది. మనకు నచ్చిన వాళ్ళు మనతో నిజాయితీగా ఉండడం, మన పట్ల శ్రద్ధ చూపడం, మన కోసం కొన్ని చిన్న పనులు చేయడం, మన ఆలోచనలో ఉండడం గొప్ప రొమాంటిక్ చర్య అనేది నా ఉద్దేశం. చిన్న టచ్ చాలు”… ఇలా తన దృష్టిలో రొమాన్స్ అంటే ఇది అని చెప్పింది ఈ భామ. మృణాల్ ఠాకూర్‌కి తెలుగులో చాలా క్రేజ్ ఉంది. అయితే హీరోయిన్‌గా మరో తెలుగు సినిమా కోసం ఆమె ఎదురుచూస్తోంది. మరోవైపు హిందీలో ఒక మూవీ చేస్తోంది. ఒక బడా బాలీవుడ్ మూవీ కూడా ఒప్పుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News