Thursday, December 26, 2024

ఎస్‌కె వర్సిటీలో మృత్యుంజయ హోమం: విసి వివాదాస్పద నిర్ణయం

- Advertisement -
- Advertisement -

అనంతపురం: తమ యూనివర్సిటీ ఉద్యోగులు పలువురు ఇటీవలి కాలంలో అకాల మరణం చెందుతుండడంతో కలత చెందిన శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ(ఎస్‌కెయు) పాలకులు దీన్ని నివారించేందుకు ప్రత్యేక పూజలు, హోమాలు జరపాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

ఫిబ్రవరి 24న యూనివర్సిటీ క్యాంపస్‌లో శ్రీ ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం నిర్వహించనున్నారు. యూనవిర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం రామకృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 8.30 గంటలకు యూనివర్సిటీ క్రీడా వేదిక వద్ద హోమం నిర్వహిస్తున్నట్లు ఎస్‌కెయు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవి లక్ష్మయ్య సర్కులర్ జారీచేశారు. ఉద్యోగులు, విద్యార్థులకు భగవంతుడి అనుగ్రహం లభించాలన్న ఉద్దేశంతోనే హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News