Wednesday, April 16, 2025

మ్యాచ్‌లో దంచేసిన ధోనీ.. మరో అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఈ ఫ్రాంచైజీ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే గత సీజన్‌లో కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కి అప్పగించింది. కెప్టెన్ మారడమో.. లేక ఇతర కారణాల చేతనో జట్టు ప్లేఆఫ్‌కి చేరలేకపోయింది. ఈ సీజన్‌ కూడా ఆరంభం నుంచి సిఎస్‌కె చెత్త ప్రదర్శన చేస్తోంది. ఆడిన తోలి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే రుతురాజ్‌కి గాయం కావడంతో తిరిగి ధోనీకి కెప్టెన్సీ అప్పగించడంతో.. జట్టు తిరిగి ఉత్సహాన్ని పుంజుకుంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో 26 పరుగులు చేశాడు. దీంతో ఆయన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు దక్కించుకన్న ధోనీ.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 43 సంవత్సరాల 280 రోజుల వయస్సులో ఈ అవార్డును అందుకొని అతి పెద్ద వయస్సులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ప్రవీణ్ తాంబే పేరిట ఉండేది. 2014 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడియన తాంబే.. 42 సంవత్సరాల 208 రోజుల వయస్సులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News