Wednesday, January 22, 2025

ధోని మోకాలి శస్త్ర చికిత్స సక్సెస్

- Advertisement -
- Advertisement -

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎడమ మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని సిఎస్‌కె సిఇఓ విశ్వనాథన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లించారు. రెండు రోజుల్లో ధోనిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ధోని పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడన్నారు. ఇటీవల జరిగిన ఐపిఎల్ టోర్నమెంట్ సందర్భంగా ధోని మోకాలి సమస్యతో బాధపడ్డాడు.

అయినా కూడా ధోని ఫైనల్ ముగిసే వరకు జట్టుతో కొనసాగాడు. ఐపిఎల్ ముగిసిన వెంటనే ముంబైకి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. బిసిసిఐ మెడికల్ ప్యానెల్‌లో సభ్యుడైన డాక్టర్ దిన్‌షా పార్ధివాలా నేతృత్వంలోని వైద్య బృందం ధోనికి ఆపరేషన్ నిర్వహించింది. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ధోనికి శస్త్రచికిత్స జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News