అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై చాలా సంవత్సరాలు గడిచిన మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన ఐపిఎల్‌లో ఆడే రెండు నెలల కోసం పది నెలలు ఎదురు చూస్తుంటారు అభిమానులు. మరోవైపు ధోనీ ఇంత వరకూ ఆడింది చాలని.. ఇకనైనా రిటైర్‌మెంట్ ప్రకటిస్తే.. మేలని అనేవాళ్లు ఉన్నారు. వారందరికి ధోనీ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ని చూసేందుకు ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకీ దేవిలు స్టేడియంకి వచ్చారు. దీంతో ఇదే ధోనీ చివరి మ్యాచ్ అని.. అందుకే వాళ్లు స్టేడియంకి వచ్చారు అని పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా దీనిపై ధోనీ కామెంట్ చేశారు. తాను ఇప్పటికిప్పుడు ఐపిఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించను అని ధోనీ స్పష్టం చేశారు. ఐపిఎల్ ఆడే విషయాన్ని ప్రతీ సంవత్సరం సమీక్ష చేసుకుంటానని అన్నారు.
‘ఆడాలా వద్ద అని నిర్ణయించుకోవడానికి 10 నెలల సమయం ఉంటుంది. అయితే నేను ఆడాలా వద్ద అని నిర్ణయించేది నేను కాదు.. నా శరీరం. శరీరం సహకరిస్తే.. సీజన్ ఆడతా.. లేకుంటే లేదు. అప్పటివరకూ కొనసాగిస్తా’ అని ధోనీ పేర్కొన్నారు.