Saturday, November 23, 2024

ధోనీకి అరుదైన గౌరవం!

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరో అరుదైన గౌరవం దక్కనుంది. 2011లో ధోనీ సారథ్యంలో టీమిండియా వన్డే ప్రపంచకప్‌ను సాధించిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ 2011లో మరో ప్రపంచకప్‌ను ముద్దాడింది. కప్పు గెలిచి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ గెలిచిన జట్టుకు సారథిగా ఉన్న ధోనీని అరుదైన రీతిలో సత్కరించాలని మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసిఎ) నిర్ణయించింది.

శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో చివరి బంతికి భారీ సిక్స్ కొట్టి ధోనీ భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. ధోనీ సిక్స్ కొట్టిన సమయంలో బంతి ఎక్కడైతే పడిందో ఈ సీటుకు మహి పేరును పెట్టాలని ఎంసిఎ నిర్ణయించింది. ఫైనల్ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన వాంఖడే స్టేడియంలోని ఆ సీటుకు ధోనీ పేరు పెట్టి సన్మానించాలని ఎంసిఎ తీర్మానించింది. ఈ విషయాన్ని ఎంసిఎ అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News