Monday, December 23, 2024

IPL 2024: ధోనీ అభిమానులకు షాక్.. చెన్నై కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024 ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా రుజురాజ్ గైక్వాడ్ ను ప్రకటించింది యాజమాన్యం. ఐపిఎల్ ప్రారంభానికి ఒకరోజు ముందు గురువారం సోషల్ మీడియా వేదికగా సిఎస్ కె వెల్లడించింది. దీంతో సిఎస్ కె, ధోనీ ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు. అయితే, ధోనీ అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఎస్ కె తెలిపింది. ధోనీ.. సిఎస్ కె కెప్టెన్ బాధ్యతలను రుతురాజ్ కు అప్పగించినట్లు పేర్కొంది.

‘IPL 2024 ప్రారంభానికి ముందు రుతురాజ్ గైక్వాడ్‌కి MS ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని అప్పగించాడు. రుతురాజ్ 2019 నుండి చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు ఆడుతున్నాడు. అప్పటి నుంచి IPLలో మొత్తం 52 మ్యాచ్‌లు ఆడాడు.  ప్రారంభం కాబోయే ఈ సీజన్ కోసం జట్టు ఎదురుచూస్తోంది’ అని CSK తెలిపింది.

ఇప్పటివరకు ధోనీ సారధ్యంలో జైత్రయాత్రను కొనసాగించిన చెన్నై జట్టును రుతురాజ్ ఏ మేరకు నడిపిస్తాడో చూడాలి. కాగా, ఐపిఎల్ చెన్నైకి ధోనీ నాలుగు సార్లు కప్ న అందించిన సంగతి తెలిసిందే. ఐపిఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్లు మాత్రమే నాలుగుసార్లు కప్ గెలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News