లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్).ఇండియన్ లెజెండరీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్స్ విడుదల చేస్తున్నాయి.
Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి
ఈ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత సాక్షి ధోని, హీరో హరీష్ కళ్యాణ్, హీరోయిన్ ఇవానా, నదియా, త్రిపుర ప్రొడక్షన్స్ త్రిపుర పసుపులేటి తదితరులు పాల్గొన్నారు. నిట్రో స్టార్ సుధీర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ “ఈ సినిమా ట్రైలర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఆసక్తికరంగా అనిపించింది. లెజెండరీ క్రికెటర్ ధోనీ క్రికెట్‌లో ఎలాంటి విజయాలను సాధించారో అలాంటి సక్సెస్‌ను సినిమా రంగంలోనూ సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. సాక్షి ధోని మాట్లాడుతూ “ఎల్‌జిఎం సినిమాను తమిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అందువల్ల ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం”అని తెలిపారు.