టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటే గుర్తుకు వచ్చేది ఆయన ప్రశాంతతే. మైదానంలో మ్యాచ్ ఎంత ఒత్తిడిలో ఉన్నా.. తను మాత్రం ప్రశాంతంగా ఉంటూ అనేకసార్లు ఇండియాను గెలిపించాడు ధోనీ. అలాంటి ధోనీ.. ‘యానిమల్’గా మారిపోతే.. అది కూడా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో.
అవును.. ఇది నిజం. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ధోనీ యానిమల్ అవతారం ఎత్తాడు. అయితే అది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ షూట్ కోసం. యానిమల్ సినిమాలో చూపించిన మూడు సీన్లను ఈ యాడ్‌లో చూపించారు. మొదలు బ్లూ కోటు ధరించి బ్లూ కార్‌లోంచి ధోనీ దిగుతాడు. ఆ తర్వాత సైకిల్‌పై హీరోయిన్ ఇంటికి వెళతాడు. చివరిగా క్లైమాక్స్‌లో హీరో చేతితో సైగ చేసి చూపించే సీన్. ఈ మూడు సీన్లను ఈ యాడ్‌లో రీక్రియేట్ చేశారు. ఈ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ధోనీని కొత్త అవతారంలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ధోనీ ప్రస్తుతం ఐపిఎల్ కోసం సిద్ధమవుతుండగా.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.