Monday, December 23, 2024

ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్

- Advertisement -
- Advertisement -

భారత దిగ్గజ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ధరించిన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) రిటైర్ చేసింది. సచిన్ టెండూల్కర్ తర్వాత బీసీసీఐ తన జెర్సీని రిటైర్ చేసిన రెండో ఆటగాడిగా ధోనీ నిలిచాడు. ధోనీ క్రీడకు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అతని జెర్సీని రిటైర్ చేయాలని నిర్ణయించుకున్నట్లు బిసిసిఐ తెలిసింది. నంబర్ 7 జెర్సీని ఏ ఆటగాడు ఉపయోగించడానికి అందుబాటులో ఉండదు.

క్రికెట్‌లో దిగ్గజ వ్యక్తి అయిన ధోని ఆటగాడిగా, కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. భారత జట్టు సారథిగా, అతను అన్ని ప్రధాన ICC ట్రోఫీలలో తన జట్టును విజయపథంలో నడిపించాడు. 2007 T20 ప్రపంచ కప్, 2011 ODI ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించాడు. భారత్ తరఫున 350 ODI మ్యాచ్‌లు ఆడిన ధోని 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు చేశాడు. T20I లలో, ధోని 98 మ్యాచ్‌లలో 1617 పరుగులు చేశాడు. 97 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడిన ధోనీ 4876 పరుగులు చేశాడు. ఆరు సెంచరీలు, 33 అర్ధసెంచరీలు కొట్టాడు. అదే సమయంలో వికెట్ కీపర్‌గా 294 అవుట్‌లను చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News