Thursday, January 23, 2025

మోడీవి మట్టి మాటలు, ఉట్టి మాటలు: ప్రభాకర్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పోయి గతంలో మట్టి మాటలు చెప్పారని,  హైద్రాబాద్ వచ్చి ఉట్టి మాటలు చెప్పి పోయారని ప్రభుత్వ విప్ ఎం. ఎస్. ప్రభాకర్ రావు ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ భవన్ నుంచి ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడారు. మోడీ మట్టి మాటలు ఉట్టి మాటలతో ఒరిగేదేమీ లేదన్నారు. మన మెట్రోకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదో  మోడీని బిజెపి నేతలు నిలదీయాలన్నారు. వరదలు వచ్చినపుడు కూడా హైద్రాబాద్ కు నయా పైసా మోడీ ఇవ్వలేదని,
బిజెపి ఎంపిలు ఏం చేయడం లేదన్నారు. ఈ రోజు మీటింగ్ లోనైనా మోడీ తెలంగాణకు ప్రాజెక్టులు ప్రకటించాలన్నారు.

తెలంగాణ దేశంలో ఉందా? లేదా? మోడీకి తెలంగాణ కనిపించడం లేదా? అని ప్రభాకర్ రావు ప్రశ్నించారు.  మత విద్వేషాలు రెచ్చగొట్టడం మాని బిజెపి నేతలు తెలంగాణ కు పనికొచ్చే పని చేయాలని సూచించారు. జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక పై రేప్ వ్యవహారం పై చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ కేసులో అతిగా వ్యవహరించారని మండిపడ్డారు. తన పబ్లిసిటీ కోసం రఘునందన్ వీడియో లు బయట పెట్టారని, రఘునందన్ దగ్గర ఆధారాలు ఉంటే దర్యాప్తు అధికారులకు ఇవ్వాలన్నారు. బాధ్యతను మరచి వీడియోలు బయట పెట్టారని, బిజెపిలో తన ప్రాభవం పెంచుకునేందుకు రఘునందన్ అలా చేశారని మండిపడ్డారు. రేప్ వ్యవహారాన్ని బిజెపి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బిజెపి నేతల స్టేట్మెంట్ లు ఉంటున్నాయని, బిజెపి కార్పొరేటర్లతో మోడీ ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా గ్రేటర్ సిటీకి నిధులు ఇచ్చి పంపాలన్నారు. గ్రేటర్ సిటికి ఒక్క రూపాయి కూడా మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. గ్రేటర్ సిటీ అభివృద్ధి గురించి మోడీకి బిజెపి కార్పొరేటర్లు చెప్పాలని, సిటీ అభివృద్ధి కోసం 2వేల కోట్లు తీసుకరావాలని డిమాండ్ చేశారు. రెండు వేల కోట్లు హైదరాబాద్ కు బిజెపి కార్పొరేటర్లు తెస్తే ఎయిర్ పోర్టుకు వెళ్లి కార్పొరేటర్లకు పూలమాల వేస్తామన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గా విఫలమయ్యారని రాజీనామా చేయ్యాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News