Saturday, December 21, 2024

యూత్ సినిమానే కాదు ఫ్యామిలీ సినిమా కూడా..

- Advertisement -
- Advertisement -

MS Raju about '7 Days 6 Nights' Movie

మెగా మేకర్ ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ’7 డేస్ 6 నైట్స్’. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు కాగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లు. ’డర్టీ హరి’తో గత ఏడాది హిట్ అందుకున్న ఎంఎస్ రాజు ఆ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మీడియాతో మాట్లాడుతూ “నేను మొదటి నుంచి కొత్త తరం సినిమాలతో పాటు పాత చిత్రాలు చూస్తుంటాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం… ఎపిక్ సినిమాలు చూస్తా. కరోనా కాలంలో ’డర్టీ హరి’ తర్వాత కొన్ని కథలు అనుకుంటున్నాను. అప్పుడు రాజ్ కపూర్ ‘బర్సాత్’ చూశా. అందులో రెండు పాత్రలు నాకు బాగా నచ్చాయి. ఒకడు అతి మంచోడు. వాడికి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. హీరో ఎప్పుడూ ఏదో ఒక డేంజర్‌లో ఉంటాడు. ’బర్సాత్’ క్యారెక్టర్లు నచ్చడంతో వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఈ కొత్త కథ రాశా. ‘బర్సాత్’లో రాజ్ కపూర్ క్యారెక్టర్ తరహాలో సుమంత్ పాత్ర ఉంటుంది. ఇదొక కేర్‌లెస్ రోల్. జీవితంలో అతడికి ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని ఇంకా చేరుకోలేదు. మరో వైపు ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్తుంది. ఆ డిప్రెషన్ కనిపించాలంటే గడ్డం పెంచి, బరువు పెరగాలని చెప్పాను. డాక్టర్‌కు సైతం అందని డిప్రెషన్‌లో ఉంటారు.

’బర్సాత్’లో రాజ్ కపూర్ ఫ్రెండ్ రోల్ ప్రేమనాథ్ చేశారు. మా సినిమాలో అటువంటి రోల్ రోహన్ నటించాడు. కథ, నేపథ్యాలు వేర్వేరు. ఈ సినిమాలో రోహన్ చేసే కామెడీకి జనాలు నవ్వుతారు. పక్కన మరో ఎమోషనల్ రోల్ ఉంది. దానికి సుమంత్ సరిపోయాడు. ‘7 డేస్ 6 నైట్స్’ అంటే ఏదో అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లడం కాదు… ఇందులో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది. ఇంటర్వెల్ నుంచి ప్రేక్షకులు ఒక ట్రాన్స్‌లోకి వెళ్తారు. ఇది యూత్ సినిమానే కాదు ఫ్యామిలీ సినిమా కూడా. ఇక రాజమండ్రి లాంటి ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో తీసిన సినిమా ’సతి’. మిస్టరీ జానర్ సినిమా ఇదని చెప్పవచ్చు. నేను గతంలో తీసిన ఒక సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నా. దాన్ని 14 భాషల్లో తీస్తాం. అక్టోబర్‌లో సినిమా ప్రారంభిస్తాం”అని అన్నారు.

MS Raju about ‘7 Days 6 Nights’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News