Sunday, February 23, 2025

అధికార లాంఛనాలతో స్వామినాథన్ అంత్యక్రియలు పూర్తి

- Advertisement -
- Advertisement -

చెన్నై: హరిత విప్లవ పితామహుడు , ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఢనాలతో శనివారం పూర్తయ్యాయి. బెసాంట్ నగర్ విద్యుత్ శ్మశాన వాటికలో స్వామినాథన్ పార్థివ దేహానికి పోలీస్‌లు గాల్లోకి కాల్పులు జరపడం ద్వారా నివాళులు అర్పించారు. అనంతరం తమిళనాడు సంప్రదాయ రీతిలో శంఖం పూరించారు. స్వామినాథన్ పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు విద్యుత్ దహనవాటిక ద్వారా చితికి నిప్పంటించారు. 98 ఏళ్ల స్వామినాథన్ వృద్ధాప్య సమస్యలతో గురువారం మరణించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News