Monday, April 21, 2025

ముంబై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్-18లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములకు చెక్ పెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ(76), సూర్యకుమార్ యాదవ్(68)లు భీకర బ్యాటింగ్‌తో చెన్నై బౌలర్లపై విరుచుపడ్డారు. సిక్పర్లు బౌండరీలతో శివాలెత్తారు. దీంతో 177 పరుగుల లక్ష్యంతో బరిలోకిదిగిన ముంబై 15.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

అంతకుముందు టాస్ ఓడితొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (53), శివమ్ దూబే (50) అర్ధ శతకాలతో రాణించారు. ఆయుష్ మాత్రే (32), షేక్ రషీద్ (19), ఓవర్టన్ (4) పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ (4), రచిన్ రవీంద్ర (5) నిరాశపరిచారు. ముంబయి బౌలర్లలో బుమ్రా రెండు, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, శాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో బరిలోకిదిగిన 17 ఏళ్ల ఆయూష్ మాత్రే.. అరంగేట్ర మ్యాచులోనేభారీ షాట్లతో అలరించాడు. రెండు సిక్సులు, నాలుగు ఫోర్లు బాది 32 పరుగుల చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News