Monday, December 23, 2024

హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ నుంచి ఫీడ్‌బ్యాక్ కోరిన ఎంఎస్‌సిఐ

- Advertisement -
- Advertisement -

లండన్: షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జారీ చేసిన నివేదికపై ఇండెక్స్ ప్రొవైడర్ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్‌సిఐ) ఇటీవల అదానీ గ్రూప్ నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కోరింది. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఎంఎస్‌సిఐ అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తోంది. పరిస్థితులు, వాస్తవాలను బేరీజు వేస్తోంది. అవి ప్రభావం చూపుతాయని కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్ నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కోరింది. ఇదిలావుండగా సిపిఐ(ఎం) నాయకుడు సీతారామ్ ఏచూరి ‘ఒకవేళ హిండెన్‌బర్గ్ నివేదిక సత్యమని తేలితే, అది ఎల్‌ఐసి, ఎస్‌బిఐలో ఉన్న కోట్లాది మంది భారతీయుల పొదుపును నాశనం చేయగలదు’ అని అన్నారు. ‘అదానీ ఎక్స్‌పోజర్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రస్తుతానికి మేము చింతించడంలేదు’ అని ఎస్‌బిఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖరా ‘రాయిటర్స్’ వార్తా సంస్థతో అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News