Monday, December 23, 2024

కనీస మద్దతు ధర చట్టం తక్షణమే అసాధ్యం

- Advertisement -
- Advertisement -

కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా

న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర చట్టం తక్షణ రీతిలో తీసుకురావడం అసాధ్యం అని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. రైతుల చలోఢిల్లీ నేపథ్యంలో మంగళవారం ఆయన ఈ విషయంపై స్పందించారు. ఏదైనా కీలక విషయంపై చట్టం తీసుకురావాలంటే సంబంధిత భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు అవసరం, ఇందుకు సమయం పడుతుంది. దీనిని కాదని వెనువెంటనే ఎంఎస్‌పి చట్టం తీసుకురావడం కుదరదు కదా అని మంత్రి స్పష్టం చేశారు. రైతులు తమ సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మక స్థాయి చర్చలకు దిగాలని కోరారు.

రైతులు ఈ దశలో ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, కొన్ని శక్తులు తమ రాజకీయ స్వీయ ప్రయోజనాలకు ఈ రైతుల నిరసనల ఘట్టాన్ని వాడుకుని, వారిని అప్రతిష్టపాలు చేయడానికి సంకల్పించాయి. ఈ విషయాన్ని రైతు ప్రతినిధులు గుర్తించాలని తెలిపారు. ఇటువంటి శక్తుల పట్ల జాగ్రత్తలు అవసరం అని హెచ్చరించారు. వారి కుట్రలను తెలుసుకోండి, అప్రమత్తంగా ఉండండని కోరారు.

రైతుల ఆందోళనకు సారధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులతో చర్చలు జరిపిన కేంద్ర మంత్రుల ప్రతినిధి బృందంలో వ్యవసాయ మంత్రి కూడా ఒక్కరుగా ఉన్నారు. సోమవారం నాటి చర్చల విఫలం అయ్యాయి. అయితే ఇవి విఫలం కాలేదని, అసంపూర్తిగా నిలిచాయని మంత్రి తెలిపారు. రెండు దఫాల చర్చలలో పలు విషయాలపై అంగీకారం కుదిరిందని, అయితే కొన్ని విషయాలపై సయోధ్య లేదని మంత్రి అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News