- Advertisement -
న్యూఢిల్లీ : వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినందున రైతులు ఆందోళన విరమించి ఇళ్లకు తిరిగి వెళ్లాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతుల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. పంటల వైవిధ్యం, జీరో బడ్జెట్ పార్కింగ్, మద్దతుధర యంత్రాంగాన్ని పటిష్టం చేయడం వంటి అనేక అంశాలపై చర్చించడానికి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఈ కమిటీల్లో ఉంటారని పేర్కొన్నారు. రైతులు పంట వ్యర్ధాలను దగ్ధం చేయడాన్ని నేరపూరిత చర్యగా చూడరాదన్న రైతు సంఘాల డిమాండ్ కూడా నెరవేరినట్టేనని మంత్రి తెలిపారు.
- Advertisement -