ఢిల్లీ: ఐఐటి విద్యార్థులు ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఐఐటి ఢిల్లీలో నెర్కర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన నెర్కర్ ఎంటెక్ చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ చదువును కొనసాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు గురువారం ఫోన్ చేయగా నెర్కర్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి స్నేహితులకు ఫోన్ చేశారు. వారి గదికి వెళ్లి చూడగా లోపలి నుంచి గడియ పెట్టినట్లుగా గుర్తించారు. వెంటనే కాలేజీ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూడగా ప్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజస్థాన్‌లోని కోటా విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారింది. పోటీ పరీక్షల కోసమని కోటాకు వచ్చి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరణీత్ రాయ్(18) అనే 12 వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి ఉన్నపళంగా కిందపడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. చదువుల ఒత్తిడితోనే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.